బంగారం పరుగులు.. ఎంతంటే..

By సుభాష్  Published on  16 May 2020 7:31 PM IST
బంగారం పరుగులు.. ఎంతంటే..

వరుసగా బంగారం ధరలు పరులు పెడుతున్నాయి. శనివారం దేశీయంగా బంగారం ధరలు ఎగబాకాయి. ఇక అదే దారిలో కూడా వెండి కూడా పయనిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.120 పెరుగుతూ రూ.44,840లకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 120 పెరుగుదలతో రూ.47,840కి ఎగబాకింది. వెండి కూడా అదే బాటలో.. కిలో వెండి రూ.2100 పెరుగుదలతో ప్రస్తుతం రూ.45,250కు చేరుకుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 పెరుగుదలతో రూ. 47,800కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరుగుదలతో రూ. 45,600లకు ఎగబాకింది. ఇక వెండి కిలో రూ. 2100 పెరిగి రూ.45,250 వేలకు చేరుకుంది. కాగా, అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు, దేశీయంగా బంగారం డిమాండ్‌, స్థానిక పరిస్థితుల ఆధారంగా ధరల్లో హెచ్చు తగ్గుల ఉండవచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

ఢిల్లీ - రూ. 47,800

హైదరాబాద్‌ - రూ. 47,870

చెన్నై- రూ. 47,870

ముంబై - రూ. 46,600

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

ఢిల్లీ - రూ.45,600

హైదరాబాద్‌ - రూ. 44,840

చెన్నై - రూ. 44,840

ముంబై - 45,600

Next Story