'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాలో పూజా హేగ్డే న‌టిస్తుందా..? ఇది నిజ‌మేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 8:55 AM GMT
స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో పూజా హేగ్డే న‌టిస్తుందా..? ఇది నిజ‌మేనా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం 'స‌రిలేరు నీకెవ్వ‌రు'. విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తుంటే... కీల‌క పాత్ర‌లో విజ‌య‌శాంతి న‌టిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంక‌ర‌, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏమిటంటే... ఒక స్పెష‌ల్ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నార‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఏ సందర్భంలో వస్తుందో తెలియదు గానీ, మరో పాట కోసం పూజా హెగ్డేను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరికాస్త గ్లామర్ టచ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

తెలుగు తెరపై ఇప్పుడు పూజా హెగ్డే జోరు కనిపిస్తోంది. వరుస సక్సెస్ ల కారణంగా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ సినిమాలో పూజా హేగ్డే న‌టిస్తే... ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌డం ఖాయం. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

Next Story
Share it