విశాఖ ఉత్సవ్‌లో.. 'సరిలేరు నీకెవ్వరు' డాంగ్ డాంగ్ సాంగ్ లాంచ్..!

By Newsmeter.Network  Published on  30 Dec 2019 2:40 AM GMT
విశాఖ ఉత్సవ్‌లో.. సరిలేరు నీకెవ్వరు డాంగ్ డాంగ్ సాంగ్ లాంచ్..!

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. కాగా డిసెంబర్ 28న జరిగిన విశాఖ ఉత్సవ్‌ లో మంత్రి అవంతి శ్రీనివాస్ చేతులమీదుగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం నుండి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి డాన్స్ చేయడం ప్రేక్షకాభిమానుల్ని అలరించింది. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల కోరికపై డాంగ్ డాంగ్ పాటకు డాన్స్ వేసి ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా..నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ - " జనవరి 11న సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు విడుదల కాబోతుంది. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరి మనసులను దోచుకోబోతున్నారు మహేష్ బాబు. అనిల్ రావిపూడి నుండి నెవర్ సీన్‌ బిఫోర్ మూవీ అలాగే మహేష్ బాబు కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరబుల్ మూవీ. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి దాని కంటే ఎక్కువే ఉంటుంది" అన్నారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - "లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 'ఎఫ్2' సినిమా కోసం విశాఖ ఉత్సవ్‌కి వచ్చి సక్సెస్ అయ్యాం. ఆ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారో నేను ఎప్పటికి మర్చిపోలేను. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవ్ కి వచ్చి 'సరిలేరు నీకెవ్వరు' నుండి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమో లాంచ్ చేశాం. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్. ఆయనిచ్చిన ఫీడ్ బ్యాక్ నేనెప్పుడూ మరువలేను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ పాటలో మీరు చూసిన డాన్స్ కొంచమే, మైండ్ బ్లాక్ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు డాన్స్ ఇంకా ఇరగదీశారు. మహేష్ బాబు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చారు. ఆయనతో చేసిన ఈ జర్నీ మరిచిపోలేనిది. ఆయన హీరోగానే కాదు వ్యక్తిగతంగా కూడా సూపర్ స్టార్. ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా జెన్యూన్ పర్సన్. ఈ సినిమా రూపంలో మంచి సక్సెస్ ఇచ్చి ఆయ‌న‌కు చిన్న‌ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా. మహేష్ చేసిన కామెడీ, ఎమోషన్స్ చూసి చాలా ఎక్సయిట్ అవుతారు అని అన్నారు.

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - " అనిల్ రావి పూడి ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. 'సరిలేరు నీకెవ్వరు' నాకు జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చిన సినిమా" అన్నారు.

Next Story