వీరిద్దరి మధ్య స్క్రిప్ట్‌ లేకపోయినా డైలాగులు అదిరాయి..

By సుభాష్  Published on  6 Jan 2020 5:21 AM GMT
వీరిద్దరి మధ్య స్క్రిప్ట్‌ లేకపోయినా డైలాగులు అదిరాయి..

ముఖ్యాంశాలు

  • 'సరిలేరునీకెవ్వరు' మూవీ మెగా ఈవెంట్ లో చిరు, రాములమ్మ
  • ఒకే వేదికపై ముచ్చటించుకున్న చిరంజీవి, విజయశాంతి
  • గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మెగా హీరో, హీరోయిన్‌

మహేష్‌ బాబు నటించిన 'సరిలేరునీకెవ్వరు' మూవీ ఈవెంట్ రాత్రి ఎల్బీస్టేడియంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి, మెగా లేడి సూపర్‌ స్టార్‌ విజయశాంతిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరు సందడి చేశారు.

దాదాపు 22 సంవత్సరాల తర్వాత వీరిద్దరు ఒకే వేదికపై ఎదురుపడ్డారు. అప్పటి పాత జ్ఞాపకాలు, రాజకీయ పరిణామాల కారణంగా వీరిద్దరిలో కాస్త గ్యాప్‌ వచ్చింది. అంతకు ముందున్న స్నేహబంధం అలాగే ఉండిపోయింది. ఒకే వేదికపై కలవడంతో పాతజ్ఞాపకాలు, రాజకీయ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ వేదికపై నవ్వులు పూయించారు. కార్యక్రమానికి హాజరైన వీరు అందరిని మర్చిపోయే తమ స్నేహబంధం గురించి ముచ్చటించుకున్నారు. నన్ను వదిలేసి దాదాపు 15 సంవత్సరాలు అయ్యింది.. ఇప్పుడు మళ్లీ కలుసుకున్నాం అని చిరంజీవి అడగగా, ఇప్పటికీ మీరు నాకు మంచి మిత్రులేనంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. వేదికపై వీరిద్దరి ముచ్చట్లు అందరికి ఆకట్టుకున్నాయి.

Sarileru Neekevvaru Event

వీరిద్దరి మధ్య స్క్రిప్ట్‌ లేకపోయినా సినిమాకు మించిన డైలాగులు బయటపడ్డాయి. చాలా సినిమాలు చేశాం.. చాలా ఏళ్ల పాటు ఇద్దరం కలిసి ప్రయాణం కొనసాగించాం అంటూ మాట్లాడుకున్నారు. సండే అనకురా..మండే అనకురా.. ఎప్పటికీ నీదాన్నిరా.. అని మాట ఇచ్చిన నా మనిషిగా, నా సినిమాలో నా హీరోయిన్‌గా ఉండకుండా నన్ను వదిలేసి దాదాపు 15 సంవత్సరాలైంది.. దూరంగా వెళ్లిపోయి మళ్లీ ఇన్నేళ్లకు కనిపించింది విజయశాంతి.. చైన్నై టీ నగర్‌లో మా ఇంటి ముందే విజయశాంతి ఇల్లు ఉండేది.. అప్పుడు మేము కుటుంబ సభ్యుల్లా ఉండేవాళ్లము.. రాజకీయాల్లో విజయశాంతి నాకన్నముందు వెళ్లినందుకు కోపంగా ఉంది అంటూ చిరంజీవి వేదికపై డైలాగులు వేయడంతో వేదిక ప్రాంగణమంతా నవ్వులతో హోరెత్తిపోయింది. ఇలా వీరిద్దరు చాలా రోజుల తర్వాత డైలాగులు, ముచ్చట్లు వేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. రాజకీయంగా గానీ, వ్యక్తిగతగా వచ్చిన భేదాభిప్రాయాల వల్ల వీరిద్దరు ఎక్కడ కలిసింది లేదు. ఒక దశలో చెప్పాలంటే చిరంజీవిపై విజయశాంతి విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు చిరంజీవి, విజయశాంతి మళ్లీ తెరపైకి వచ్చారు. వీళ్లు కలుసుకునే చాన్స్‌ ఇప్పుడే వచ్చింది. ఇక చిరంజీవి విజయశాంతిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె అందం గురించి పొగిడారు. అలాగే విజయశాంతి కూడా చిరంజీవి పొగడ్తలతో ముంచేత్తారు.

Mega Event

Next Story