తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌క‌, నిర్మాత మ‌ధ్య కానీ, సంగీత ద‌ర్శ‌కుల మ‌ధ్య చిన్న చిన్న‌విబేధాలు రావ‌డం మామూలే. కొన్ని సినిమాల్లో సంగీతం బాగా లేక‌పోవ‌డం వ‌ల్ల ద‌ర్శ‌కుల మ‌ధ్య చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్త‌లు రావ‌చ్చు. సినిమాల‌కు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌కు కొంత ఆనందం క‌లిగించినా… మ‌రికొంత నిరుత్సాహం కూడా క‌లుగ‌వ‌చ్చు. ప్రస్తుతం తెలుగులో బిజీబిజీగా గడుపుతోన్న సంగీత దర్శకుడు ఎవరు అంటే రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అని టక్కున చెప్పేస్తుంటారు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలకూ దేవీశ్రీనే అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. వాటిలో మహేష్ బాబు న‌టిస్తున్న‌ ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అదేంటంటే దర్శకుడు అనిల్ రావిపూడి, దేవీశ్రీ మధ్య విబేధాలు వచ్చాయని టాక్ .

దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్స్‌ అనిల్ రావిపూడికి నచ్చడం లేదని ఒక రూమర్ తెగ‌ వైరల్ అవుతోంది. ఏ ట్యూన్ ఇచ్చినా ఇంత కన్నా బెటర్ కావాలని దేవీని అనిల్ అడుగున్నారట. ఆర్మీ బ్యాక్ డ్రాప్లో తీస్తున్న సినిమా కాబట్టి, గత చిత్రాల మాదిరి కాకుండా ట్యూన్స్ కొత్తగా ఉండాలని పదే పదే దేవీని అనిల్ సూచిస్తున్నారని ఇండ‌స్ర్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సాంగ్స్ విషయంలో దర్శకుడు అనిల్ ఎంత తలబాదుకుంటున్నా దేవీశ్రీ మాత్రం ఆ విష‌యాన్ని మామూలుగానే తీసుకుంటున్నారని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది చెబుతున్న‌మాట‌. మరి, దీనిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, అనిల్తో దేవీశ్రీ పనిచేయడం ఇది కొత్తేమీ కాదు. అనిల్ దర్శకత్వం వహించిన ‘ఎఫ్ 2’ సినిమాకు దేవీనే మ్యూజిక్ డైరెక్టర్ ప‌ని చేశారు. ఆ సినిమాకు మంచి ట్యూన్సే ఇచ్చారు. అందుకే, మహేష్ బాబు సినిమా కోసం మళ్లీ దేవీనే ఎంచుకున్నారు. అంతేకాకుండా, మహేష్ బాబుతో చాలా సినిమాలు దేవీశ్రీనే. ‘1 నేనొక్కడినే’ మొదలుకొని ‘మహర్షి’ వరకు మహేష్ బాబుకు దేవీ మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. అందుకే, మహేష్ కూడా ఈ సినిమాకు దేవీ వైపే మొగ్గు చూపారు. కానీ, తాజాగా వస్తోన్న రూమర్లు మహేష్ అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. మరి ఇలా వస్తున్న రూమర్లు నిజమా…?కాదా అన్నది తెలియాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.