ఈయనే '83' వరల్డ్‌కప్‌లో మొహిందర్ అమర్ నాథ్ పాత్రధారి

By అంజి  Published on  18 Jan 2020 8:30 AM GMT
ఈయనే 83 వరల్డ్‌కప్‌లో మొహిందర్ అమర్ నాథ్ పాత్రధారి

బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ తీసిన స్పోర్ట్స్ ఆధారిత పీరియడ్ చిత్రం '83' విడుదలకు సిద్ధం అవుతోంది. 1983లో కపిల్‌దేవ్ నాయకత్వంలోని భారత క్రికెట్ టీమ్ ప్రపంచకప్ గెలుచుకున్న చారిత్రిక ఘట్టాన్ని ఈ చిత్రం ఆవిష్కరించబోతోంది. ఇందులో ఒక్కో నటుడు ఒక్కో క్రికెటర్ పాత్రను వేస్తున్నాడు. క్యాప్టెన్ కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ నటించబోతున్నాడు. సెమీస్, ఫైనల్స్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన అజేయ ఆల్ రౌండర్ మొహిందర్ అమర్ నాథ్ గా నటుడు సాకిబ్ సలీమ్ నటిస్తున్నాడు. మొహిందర్ పాత్రలో ఆయన లుక్ ను రణవీర్ సింగ్ షేర్ చేశాడు. ఈ లుక్ విషయంలో సాకిబ్ మహా ఎక్సైటెడ్ గా ఉన్నాడు.

నిజానికి 1983 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఇండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. చాలా మంది ఏదో పేరుకు మ్యాచ్ లు అడి వెళ్లిపోతుందని భావించారు. ఆఖరికి ఇండియన్ టీమ్ సభ్యులు సైతం తమ హాలీడేలను ప్లాన్ చేసుకున్నారు. మీడియా కూడా భారత్ ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అలాంటి టీమ్ నెమ్మదిగా ఒక్కో మ్యాచ్ గెలుస్తూ పోయింది. సెమీస్ గెలిచింది. ఆఖరికి ఫైనల్ ను కూడా గెలిచింది. నటుడు సకీబ్ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో సినిమా కోసం జరిగిన వర్క్ షాప్ లో అమర్ నాథ్ తో సమయం గడిపాడు. అప్పట్లో భారతీయ క్రీడాకారుల మనఃస్థితి గురించి అనేక ప్రశ్నలు అడిగారు. సకీబ్ అమర్ నాథ్ బ్యాటింగ్ స్టాన్స్, బౌలింగ్ స్టైల్ వంటి వాటిని కూడా నిశితంగా పరిశీలించి ప్రాక్టీస్ చేశాడు. క్రీడాకారులుగా నటిస్తున్న వారు అప్పట్లో భారతీయ ఆటగాళ్ల మధ్య జరిగిన సంభాషణల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. తమాషా ఏమిటంటే ఆటగాళ్లు పెద్దగా వ్యూహాలు, పథకాల గురించి చర్చించలేదు. కానీ నటులు మాత్రం చాలా ప్రశ్నలు వేసి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

Next Story
Share it