వైభవంగా 'సంతోషం' అవార్డ్స్ 17వ వార్షికోత్సవ కర్టెన్‌రైజర్
By న్యూస్‌మీటర్ తెలుగు
హైదరాబాద్:'సంతోషం సౌతిండియా 17వ అవార్డుల' కర్టెన్ రైజర్ బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. జూబ్లీహిల్స్‌లోని పాస్తా రాస్తాలో జరిగిన ఈ వేడుకకు ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్, బర్నింగ్ స్టార్ సుంపూర్ణేష్ బాబు అథితులుగా విచ్చేశారు. పాపులర్ సింగర్ సింహా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దక్షిణ భారత సినీ రంగంలో ప్రధానమైన అవార్డుల్లో 'సంతోషం ఫిలిం అవార్డ్స్' కూడా ఒకటి. ప్రతి ఏటా జరిగే సంతోషం అవార్డ్స్ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నారు. 29న జరగబోయే ఈ అవార్డుల ఫంక్షన్‌కు ముందుగా కర్టెన్‌రైజర్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా నబానటేశ్.. అవార్డు ఫంక్షన్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.." సంతోషం 17వ సంత్సరం అవార్డుల్లో నేను పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సంవత్సరం మంచి ప్రతిభ కనబరుస్తున్నట్లు చెప్పారు. సురేష్‌కి చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడకు విచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ " అంటూ ముగించారు నబానటేష్.
సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ..." సంతోషం అవార్డ్స్ చాలా రోజుల నుంచి ఎంతోమందికి ఇస్తున్నారని చెప్పారు. కళాకారులను ఎంకరేజ్ చేస్తూ అవార్డులు ఇస్తున్న సురేష్ భయ్యాకు థాంక్స్" అన్నారు.