ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇంత‌కీ.. ఎవ‌రా ఫ్లాప్ డైరెక్ట‌ర్..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 1:40 PM GMT
ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇంత‌కీ.. ఎవ‌రా ఫ్లాప్ డైరెక్ట‌ర్..?

అల్లుడు శీను సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ క‌థానాయ‌కుడు అల్లుడు శీను. తొలి చిత్రంతోనే విజ‌యం సాధించి.. అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు. ఆత‌ర్వాత స్పీడున్నోడు, జ‌య జాన‌కి నాయ‌క చిత్రాల్లో న‌టించినా ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయాడు. ఇటీవ‌ల రాక్ష‌సుడు సినిమాతో స‌క్స‌స్ సాధించాడు. దీంతో ఈ స‌క్స‌స్ ని నిల‌బెట్టుకునేలా మ‌రో స‌క్స‌స్ ఫుల్ మూవీలో న‌టించేందుకు చాలా క‌థ‌లు విన్నాడు.

ఆఖ‌రికి చాలా క‌థ‌లు విని ఓ ఫ్లాప్ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు సమాచారం. ఇంత‌కీ.. ఎవ‌రా ఫ్లాప్ డైరెక్ట‌ర్ అంటే... సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన సంతోష్ శ్రీనివాస్. రామ్ తో కందిరీగ, హైప‌ర్, ఎన్టీఆర్ తో రభ‌స‌ చిత్రాలు తెరకెక్కించారు. ఈ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా చేయాల‌నుకున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాని నిర్మించాలి అనుకుంది.

చాలా కాలం వెయిట్ చేసాడు కానీ.. ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్లిపోవ‌డం వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇటీవ‌ల సంతోష్ శ్రీనివాస్.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి యాక్ష‌న్ స్టోరీ చెప్ప‌డం అది బాగా న‌చ్చ‌డంతో ఆయ‌న ఓకే చెప్ప‌డం జ‌రిగిందని తెలిసింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సినిమాని ఎవ‌రు నిర్మించ‌నున్నారు అనేది తెలియాల్సివుంది.

Next Story
Share it