వాణిజ్య పన్నుల శాఖ అధికారిణిగా కల్నల్‌ సంతోష్‌ భార్య.!

By సుభాష్  Published on  23 Jun 2020 9:44 AM IST
వాణిజ్య పన్నుల శాఖ అధికారిణిగా కల్నల్‌ సంతోష్‌ భార్య.!

భారత్‌ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూర్యాపేటలోని ఆయన ఇంటికెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. కల్నల్‌ సంతోష్‌బాబు చిత్ర పటానికి నివాళులు అర్పించిన కేసీఆర్‌.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 కోట్ల చెక్కను అందించి గ్రూప్‌ -1 ఉద్యోగ నియామక పత్రం కూడా అందించారు. అలాగే హైదరాబాద్‌లోని 700 గుజాల నివాస స్థలానికి సంబంధించిన పత్రాలను అందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంతోష్‌బాబు భార్య సంతోషికి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అధికారిగా నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం.

Next Story