కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా దడ పుట్టిస్తోంది. రోజురోజుకు కరోనా మరణాలు, కరోనా పాజిటివ్‌ సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 18వేలకు చేరుకోగా, చికిత్స పొందుతున్న వారి సంఖ్య 4 లక్షలకుపైగా ఉన్నారు. కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించింది కేంద్ర సర్కార్‌.

ఇక తాజాగా మరో విషయం తెరపైకి వస్తోంది. కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు శానిటైజర్లు వాడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్తగా శానిటైజర్లు చేతులకు రాసుకుని రక్షించుకుంటున్నారు. అయితే చేతులకు శానిటైజర్లు రాసుకుని గ్యాస్ దగ్గరకు వస్తే గ్యాస్ సిలిండర్ పేలడం ఖాయమని తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో కరోనా భయం నెలకొన్నదృష్ట్యా అందరూ శానిటైజర్లను వాడుతున్నారు. ఇక శానిటైజర్ వాడిన తర్వాత ఫైర్ దగ్గరకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే శానిటైజర్లలో అధిక శాతం స్పిరిట్, ఆల్కాహాల్ ని వాడుతారు. దానికి మండే గుణం ఉంటుంది. అందువల్ల శానిటైజర్ రాసుకున్న వారు మంట దగ్గరకు వెళ్లకపోవడమే మంచిది. ముఖ్యంగా మహిళలు వంట చేసే ముందు శానిటైజర్ ఆడే అలవాటు ఉంటే జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది.

సుభాష్

.

Next Story