సానియా సాధించింది.. తల్లిగా..
By Newsmeter.Network Published on 18 Jan 2020 8:39 AM GMTరెండేళ్ల విరామం అనంతరం టెన్నిస్ బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగిన సానియా మీర్జా అదరగొట్టింది. ఆడిన తొలి టోర్నిలోనే టైటిల్ గెలిచి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించింది. హోబర్ట్ అంతర్జాతీయ టెన్నిస్ చాంఫియన్ షిప్ మహిళల డబుల్స్ పైనల్ లో ఉక్రేయిన్ క్రీడాకారిణి నదియాతో కలిసి డబుల్స్ విభాగంలో టైటిల్ ను గెలిచింది.
రెండో సీడ్ జాంగ్ షూ- పెంగ్ షూ (చైనా) జంటతో శనివారం ఫైనల్లో తలపడిన సానియా-నదియా ద్వయం 6-4, 6-4 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. 21 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి పై సానియా జోడి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సానియాకు ఇది 42వ డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిల్.
సానియా చివరగా 2017 అక్టోబరులో చైనా ఓపెన్ ఆడింది. మోకాలి గాయం, ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడం కారణంగా ఆమె రెండేళ్లకుపైగా ఆటకు దూరమైంది. ఈ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ఆమె ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొననుంది. ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి 2020 ఒలింపిక్స్‌కు సిద్దమని చెప్పకనే చెప్పింది.