మొన్నటి టైటిల్ విజేత.. నేడు మ్యాచ్ మధ్యలోనే
By Newsmeter.Network
రెండేళ్ల విరామం తరువాత హోబర్ట్ ఇంటర్నేషనల్ గెలిచి పునరాగమనాన్ని ఘనంగా చాటింది టెన్నిస్ స్టార్ సానియా మీరా. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవాలన్న తన కోరిక నెరవేరలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్ లోనే గాయం కారణంగా తప్పుకుంది. కాలి పిక్క గాయంతో ఇప్పటికే మిక్స్‌డ్ డబుల్ విభాగం నుంచి తప్పుకున్న సానియా తాజాగా మహిళ డబుల్స్ విభాగంలో తొలి మ్యాచ్ ఆడుతూ.. నొప్పిని భరించలేక మ్యాచ్ మధ్యలోనే తప్పుకుంది.
ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచెనోక్ తో కలిసి డబుల్స్ విభాగంలో బరిలోకి దిగింది. గురువారం జిన్‌యున్ హాన్-లిన్ జు (చైనా) జోడీతో తలపడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో సానియా-నదియా 2-6తో తొలి సెట్ కోల్పోయింది. అనంతరం రెండో సెట్‌లో ఫస్ట్ గేమ్ ఓడి 0-1 వెనుకంజలో ఉండగా సానియా గాయం ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె రిటైర్ట్ హర్ట్‌గా వైదొలిగారు.