భారత స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా.. గ్రాండ్‌స్లామ్‌(డబుల్స్‌)తో పాటు మరే క్రీడాకారిణికీ సాధ్యం కాని రికార్డులను ఆమె సాధించింది. ఆమె జీవితం ఆధారంగా వెండితెరపై ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే తన చరిత్రను చూపించడం ఉత్తేజాన్ని కలిగిస్తోందని అంటోంది సానియా.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘నా కథ సినిమాగా తీసే విషయమై.. దర్శకులు నాతో చర్చిస్తున్నారు. నాది ఎలాంటి వ్యక్తిత్వమో.. నా కెరీర్‌ను మొదటి నుంచి చూసిన ఎవరికైనా తెలుస్తుంది. నేనేది మనసులో దాచుకోను. నాకు ఏమనినిపిస్తే అది చేస్తా. ఏ విషమైనా బయటికి చెప్తాను. కాబట్టి నా కథను అభిమానుల ముందుకు తెస్తున్నందుకు భయపడట్లేదు. కాబట్టి నా జీవిత చరిత్రను సినిమాగా రాబోతుండటం ఉత్సాహం కలిగిస్తోందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ విజేతలను ప్రేమిస్తారు. కానీ ఎన్నో అడ్డంకులను అధిగమి ఆ స్థానానికి చేరుకువాల్సి ఉంటుంది. నాలానే ఎంతోమంది ప్లేయర్లు.. ఏమి లేని స్థాయి నుంచి స్టార్స్ గా ఎదిగారు. దేశానికి ప్రాతినిథ్యం వహించారు” అని తెలిపారు.

ఇకపోతే.. సానియా బయోపిక్‌లో నటించడానికి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. పరిణీతి చోప్రా, ఆలియాభట్, రాధికాఆప్టే వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే.. వీరిలో పరిణీతి చోప్రా నటించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.