విధ్వంసక హిట్టింగ్‌కు మారుపేరు ఆండ్రీ రసెల్. ఎలాంటి బంతినైనా తన భుజ బలంతో సిక్స్‌గా తరలించగల సామర్థ్యం ఆండ్రీ రసెల్‌ సొంతం. అమ్మాయిలకి సెక్సీగా కనిపించడానికి ఏడేళ్ల క్రితం ఓ తప్పు చేశానని ప్రస్తుతం.. అది బాగా ఇబ్బంది పెడుతుందని అంటున్నాడు.

2019 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కత్తా తరుపున ఆండ్రీ రసెల్‌ సృష్టించిన విధ్వంసాలను ఎవ్వరూ అంత త్వరగా మరిచిపోరు. దాదాపు ఓడిపోయే మ్యాచులను సైతం గెలిపించాడు. అయితే.. ఆ సీజన్‌లో బౌలింగ్‌ చూస్తూ తరుచూ పిచ్‌ పై పడిపోవడం గమనించే ఉంటారు. దానికి కారణం అతని మోకాలి గాయం. తాజాగా దీనికి గల కారణాలను వెల్లడించాడు ఈ హార్డ్‌హిట్టర్‌. నా తరహాలో శరీర సౌష్టవం కావాలని ఆశపడే వారు నేను చేసిన తప్పు మాత్రం చేయకండి అని అంటున్నాడు. రసెల్‌కు 23-24 ఏళ్ల వయసులో చిన్నగా మోకాలి నొప్పి వచ్చింది. అయితే దాన్ని పట్టించుకోలేదట. అమ్మాయిలకి సెక్సీగా కనిపించడానికి జిమ్‌లో ఎక్కువగా కష్టపడేవాడినని, కేవలం తన భుజం, ఛాతి పెద్దగా కనిపించడం కోసమే వ్యాయామం చేసేవాడినన్నారు.

మోకాలి నొప్పికి పెయిన్‌ కిల్లర్‌తో పాటు అప్పుడప్పుడూ.. చిన్న చిన్న సర్జరీలు చేయించుకున్నానని, ఏ రోజు వాటిపై శ్రద్ద పెట్టలేదన్నాడు. అపట్లో కాళ్లకి కూడా చిన్నపాటి ఎక్సర్‌సైజ్‌లు చేసి పటిష్టంగా ఉంచుకుని ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోందని అన్నాడు. 30లో పడిన తర్వాత వాటి విలువ తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ 31 ఏళ్ల ఆటగాడు.

2016, జులైలో మోడల్‌ జాసిమ్ లోరాని ఆండ్రీ రసెల్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇటీవలే ఓ పాప కూడా జన్మించింది. వెస్టిండీస్ జాతీయ జట్టు తరుపున మ్యాచ్‌లు ఆడటం ఇప్పటికే దాదాపు మానేసిన ఈ పవర్ హిట్టర్ ఐపీఎల్ లాంటి ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుండగా.. త్వరలోనే భారత్‌కి ఈ వెస్టిండీస్ పవర్ హిట్టర్ రాబోతున్నాడు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్