స‌మంత కొత్త ప్లాన్ అదిరిందిగా..!

By Newsmeter.Network  Published on  27 Nov 2019 12:12 PM GMT
స‌మంత కొత్త ప్లాన్ అదిరిందిగా..!

వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ... ఆ పాత్ర‌ల‌కు త‌న న‌ట‌న‌తో జీవం పోస్తున్న నటి సమంత. ఇటీవ‌ల మ‌జిలీ, ఓ బేబి చిత్రాల‌తో విజ‌యం సాధించిన స‌మంత ప్ర‌స్తుతం ఓ వెబ్ సిరీస్ లో న‌టిస్తుంది. త‌దుప‌రి చిత్రాల కోసం క‌థ‌లు వింటున్న‌ప్ప‌టికీ ఏ సినిమాకి ఓకే చెప్ప‌లేదు.

ఇదిలా ఉంటే ... స‌మంత నిర్మాణ రంగంలో దిగేందుకు ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. స‌మంత పెట్టే నిర్మాణ సంస్థ‌లో కేవ‌లం లేడీ ఓరియంటెడ్ మూవీస్ మాత్ర‌మే చేస్తుందని సమాచారం. అయితే చైత‌న్య‌తో త‌ను నిర్మించాల‌నుకునే సినిమాలు కూడా ఈ బ్యాన‌ర్ లో నిర్మిస్తుంద‌ని తెలుస్తోంది. ఈమేరకు ఆమె ఈ సంస్థ కోసం క‌థ‌లు వింటుంద‌ని వార్తలు వస్తున్నాయి. అయితే గీత గోవిందం డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ స‌మంత‌కి లేడీ ఓరియంటెడ్ స్టోరీ ఒక‌టి చెప్పినట్లు సమాచారం.

కాగా.. నాగ చైత‌న్య‌తో ప‌ర‌శురామ్ చేయాల‌నుకుంటున్న సినిమా పూర్తైన త‌ర్వాత స‌మంత‌తో ప‌ర‌శురామ్ సినిమా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే... ఈ బ్యాన‌ర్ పేరు ఏంటి..? ఎప్ప‌టి నుంచి ఈ సంస్థ పై సమంత సినిమాలు స్టార్ట్ చేస్తుంది..? అనేది తెలియాల్సివుంది. మొత్తానికి స‌మంత కొత్త ప్లాన్ అదిరిందిగా..!

Next Story
Share it