సమంత, రాణాలకు సాయిపల్లవి ఛాలెంజ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 3:22 PM GMT
సమంత, రాణాలకు సాయిపల్లవి ఛాలెంజ్..!

వరుణ్ తేజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను సాయిపల్లవి యాక్సెప్ట్ చేశారు.. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సాయి పల్లవి ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. మనం ప్రకృతి నుంచి ఎప్పుడు తీసుకుంటూనే ఉన్నామని, ఇప్పటికైనా ఏదో ఒకటి ఇవ్వటం మొదలు పెడదాము అన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రదేశంలో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని అభిమానులను కోరారు. తన స్నేహితులైన రానా దగ్గుబాటి, సమంత లను ఈ ఛాలెంజ్ తీసుకోవాలంటూ టాగ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ను వరుణ్ తేజ్ యాక్సెప్ట్ చేశారు. తనను టాగ్ చేసిన సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు చెబుతూ వరుణ్ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. తర్వాత సాయి పల్లవి, తమన్నా లకు టాగ్ చేశారు. పచ్చదనాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత మన అందరిదీ అంటూ ఇగ్నైటింగ్ మైండ్స్, వాక్‌ఫర్ వాటర్ సంస్థలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జూలై 27వ తేదీన ఈ కార్యక్రమం మొదలైంది. ' హరా హై.. తో భరా హై 'అనే నినాదంతో గ్రీన్ చాలెంజ్‌ గ్రీన్ సునామి సృష్టించే దిశగా ముందుకు వెళుతోంది.

Next Story
Share it