సైరా ర‌న్ టైమ్ ఎంత‌..?  ఇది ప్ల‌స్సా..?  మైన‌స్సా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 10:33 AM GMT
సైరా ర‌న్ టైమ్ ఎంత‌..?  ఇది ప్ల‌స్సా..?  మైన‌స్సా..?

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా న‌ర‌సింహారెడ్డి'. ఈ సినిమాకు స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుపతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. గాంధీ జ‌యంతి సందర్భంగా అక్టోబ‌ర్ 2న ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు.

Related image

సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2గంటల 50 నిమిషాల 50 సెకన్లు. ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన సినిమాలు దాదాపు 2 గంట‌ల 30 నిమిషాలు ఉంటున్నాయి. సినిమా ర‌న్ టైమ్ అనేది సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది. ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన‌ అర్జున్ రెడ్డి సినిమా ర‌న్ టైమ్ దాదాపు 3 గంట‌లు. అయిన‌ప్ప‌టికీ ఆ సినిమా ఏస్ధాయి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే.

Related image

సినిమా క‌థ‌, క‌థ‌నంలో ప‌ట్టు ఉంటే... ర‌న్ టైమ్ 3 గంట‌లు ఉన్నా.. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ఒక్కొక్క‌సారి సినిమా బాగున్నా... ర‌న్ టైమ్ ఎక్కువ ఉండ‌డం అనేది మైన‌స్ అవుతుంటుంది. మ‌రి... సైరాకి 2 గంట‌ల 50 నిమిషాల నిడివి అనేది ప్ల‌స్సా..? మైన‌స్సా..? అనేది తెలియాలంటే అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు ఆగాల్సిందే.

Next Story
Share it