ఫోర్బ్స్ 30 అండర్ 30 లో సాయిపల్లవి
By రాణి Published on 8 Feb 2020 6:25 PM ISTతమిళ భామ సాయి పల్లవి తన అద్భుతమైన నటన, డాన్స్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. వృత్తి రీత్యా వైద్యురాలైనప్పటికీ..పిలవకుండానే వచ్చిన సినిమా అవకాశాన్ని కాదనలేకపోయింది. తమిళంలో మలర్ సినిమాతో పరిచయమైన ఈ అమ్మాయి తెలుగులో ఫిదా సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. దియా, మారి 2, హేయ్ పిల్లగాడ (డబ్బింగ్ మూవీ), ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సాయిపల్లవి నటించిన తమిళ మలర్ చిత్రం తెలుగులో రీమేక్ అయింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరీ, వేణు ఉడుగుల దర్శకత్వం చేస్తున్న విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి రానా సరసన నటిస్తోంది.
1992, మే 9వ తేదీన పుట్టిన ఈ భామ తాజా ఫోర్బ్స్ మాగ్జైన్ వెల్లడించిన ఫోర్బ్స్ 30 అండర్ 30లో ఎంటర్ టైన్ మెంట్ కేటగిరీలో స్థానం సంపాదించుకుంది. దీంతో అరుదైన ఘనత దక్కించుకున్న తెలుగు, తమిళ కథానాయికగా సాయిపల్లవి తనదైన ముద్ర వేసేసింది. ఈటీవీ ఛానెల్ లో ప్రసారమైన ఢీ సీజన్ 4లో సాయిపల్లవి ఒక కంటెస్టెంట్. ఆ షో లో తన డాన్స్ తో అందరినీ మైమరపించిన సాయిపల్లవి ఇప్పుడు ఫోర్బ్స్ అండర్ 30లో చోటు దక్కించుకుంది.
ఈ విషయం తెలుసుకున్న పల్లవి ఉబ్బితబ్బిబై అభిమానులతో తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
http://www.forbesindia.com/lists/30-under-30-2020/1829/all