భద్రాద్రి కొత్తగూడెం: ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకూ సమ్మె ఆపేదిలేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ కాన్వాయ్‌ను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. బ్రిడ్జి సెంటర్‌ వద్ద మంత్రి కారుకు అడ్డంగా కింద పడుకొని కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు. కారుకు అడ్డంగా ఉన్న కార్మికులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. పలువురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో మార్గం ద్వారా మంత్రి సత్యవతి రాథోడ్‌ స్వామి వారి ఆలయానికి వెళ్లారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.