కొత్తగూడెం: ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీక్షా శిబిరంలో బ్యానర్లను, టెంట్‌, కుర్చీలను పోలీసులు తొలగించారు.

శాంతియుతంగా చేస్తున్న దీక్షలను భగ్నం చేశారని ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కుట్రపూరితంగానే ఈ ఘాతూకానికి ఒడిగట్టారని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు.

RTC STRIKE

రోడ్డు దిగ్భంధనంలో కార్మిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా ఒక్కసారిగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కొత్తగూడెం డీఎస్పీ నేతృత్వంలో కార్మిక నేతలను అదుపులోకి తీసుకున్నారు.

అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పెట్రోలు పోయడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. మహిళా కండక్టర్‌కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

Img 20191105 Wa0124

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.