ముఖ్యాంశాలు

  • ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం
  • ఆర్టీసీ విలీనంపై క్లారిటీ ఇచ్చిన టీఎస్ కేబినెట్
  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని నిర్ణయం
  • కార్మికుల పొట్ట కొట్టమన్న ప్రభుత్వం
  • నష్టాలు వచ్చే రూట్లలో ప్రైవేటు బస్సులు
  • కేంద్రం చట్టం ప్రకారం ముందుకెళ్తున్నామన్న సీఎం
  • ఆదివారం ఉ.10 గంటలకు ఆర్టీసీ జేఏసీ సమావేశం
  • తెలంగాణపై ఆర్దిక మాంద్యం ప్రభావం ఉందన్న సీఎం

ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం అయింది. 49 అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని తెలంగాణ కేబినెట్ తేల్చి చెప్పింది. ఇప్పటికే..2వేల 100 ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. సమ్మెకు వెళ్లొద్దని చెప్పినా కార్మికులు సమ్మెకు వెళ్లారని చెప్పారు. ఇల్లీగల్ సమ్మె అని లేబర్ డిపార్ట్మెంట్ చెప్పినా వినలేదన్నారు.ప్రతిపక్షాల మాట పట్టుకొని సమ్మెలో కొనసాగుతున్నారని కేబినెట్ అభిప్రాయపడింది. బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడపొద్దని హితవు పలికింది. దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీని నడిపుతున్నాయన్నారు. కేబినెట్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

rtc-will-be-incorporated-in-the-government

కేంద్రం తెచ్చిన యాక్ట్ ప్రకారమే కేంద్రం నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని జీతాలు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చామన్నారు. ఆర్టీసీలో 49వేల మంది కార్మికులు ఉన్నారని..వారి పొట్టకొట్టే ఆలోచన తమకు లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాయలో పడొద్దని కేబినెట్ సూచించింది. ప్రైవేటు బస్సులు సైతం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయన్నారు.

rtc-will-be-incorporated-in-the-government

పాసులు కూడా చెల్లుబాటు అవుతాయని చెప్పారు. కార్మికుల ఉద్యోగాలకు రక్షణగా ఉంటుందన్నారు. ప్రైవేట్ రూట్లు ఇచ్చినా పాలసీ నిర్ణయం ప్రకారమే నడుస్తాయని చెప్పారు. లాభాలు వచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు, గ్రామాల్లో ప్రైవేటు బస్సులు నడుస్తాయని తెలిపారు. నష్టాలు వచ్చే రూట్లను ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయించారు. 5వేల100 వంద ప్రైవేట్ రూట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

rtc-will-be-incorporated-in-the-government

ఆర్టీసీని విలీనం చేస్తే మిగతావాటి పరిస్థితి ఏంటీ?

rtc-will-be-incorporated-in-the-government

ఆర్టీసీ తరహాలో 92 కార్పొరేషన్లు ఉన్నాయని..ఆర్టీసీని విలీనం చేస్తే అక్కడ నుంచి డిమాండ్లు వస్తాయన్నారు.5వ తేదీ నవంబర్ లోపు కార్మికులు రీ జాయిన్ కాకపోతే మిగతా రూట్లలో కూడా ప్రైవేటికరణ చేస్తామని కేబినెట్ హెచ్చరించింది. కేంద్రం చట్టానికి లోబడే ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు.

రేపు ఉ.10గంటలకు ఆర్టీసీ JAC మీడియా సమావేశం

ఆర్టీసీ జేఏసీ ,అఖిలపక్షం పిలుపు మేరకు ఈ నెల 3న అన్ని డిపోల వద్ద ,గ్రామాల్లో ఆర్టీసీ అమరవీరులను స్మరిస్తూ సమావేశాలు నిర్వహించనున్నారు. 4న రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్షలు, 5న సడక్ బంద్ రహదారుల దిగ్బంధం చేయనున్నారు.6న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు ధర్నా, 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష చేస్తారు. 8న చలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు, 9న ట్యాంక్ బండ్ పై దీక్షలు, నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. ఇతర పార్టీలతో కలిసి పై కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

డీఏ పెంచిన ప్రభుత్వం

ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1 నుంచి జూలై 1 వరకు డి.ఎ.ను 3.144 శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో ఉద్యగుల మొత్తం డి.ఎ. 33.536 శాతానికి చేరుకుంటుంది.

rtc-will-be-incorporated-in-the-government

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.