ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణ 11కి వాయిదా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 7:20 AM GMT
ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణ 11కి వాయిదా..!

ముఖ్యాంశాలు

  • ఆర్టీసీ సమ్మెపై హైకోర్ట్ లో వాదనలు
  • రెండు విరుద్ధ నివేదికలు ఇవ్వడంపై హైకోర్ట్ ఆగ్రహం
  • వాస్తవ నివేదికలు ఇవ్వాలని ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శికి హెచ్చరిక

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావ్ హాజరయ్యారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్దముగా ఉన్నాయన్న హైకోర్ట్. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌ని హైకోర్ట్ ఆదేశించింది. ఐ ఏ ఎస్ అధికారులు ఉన్నత న్యాయస్థానానికే ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని హైకోర్ట్ అభిప్రాయపడింది. దీనిపై..ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా వివరణ ఇచ్చారు. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. అంటే.. మొదటి నివేదిక పరిశీలించాకుండానే ఇచ్చారా?.. అని హైకోర్ట్ ప్రశ్నించింది.

తక్కువ సమయంలో తమ కార్యాలయంలో ఉన్న రికార్డుల ఆధారంగా... నివేదిక రూపొందించామని..మన్నించాలని రామకృష్ణా రావు హైకోర్ట్‌ను కోరారు. క్షమాపణ రావడం సమాధానం కాదని హైకోర్ట్ ఘాటుగా వ్యాఖ్యానించింది.

వాస్తవాలు చెప్పాలని హైకోర్ట్ సూచించింది.

ఓ వైపు ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మరోసారి ఆలోచించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.

Next Story