నల్లగొండ: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 21వ రోజుకుక చేరింది. అయితే ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది నిన్న సీఎం కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌తోనే తేలిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పారు. సమ్మె ముగియదు..ఆర్టీసీని విలీనం చేయడం జరగదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన జమీల్‌ అనే డ్రైవర్‌ మానసికంగా తీవ్ర ఆందోళకు గురయ్యాడు. దీంతో నిన్న రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. జమీల్‌ మార్గ మధ్యలోనే మృతి చెందాడు. అయితే సమ్మెపై ప్రభుత్వ తీరుతోనే..జమీల్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడాని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.