నల్లగొండ : తాత్కాలిక డ్రైవర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. హాలియా మునిసిపాలిటి పరిధిలో ప్రయాణికుడు బస్సు నుంచి దిగుతున్నాడు. ఇదే సమయంలో తాత్కాలిక డ్రైవర్ బస్సు కదిలించాడు. దీంతో కుడి కాలు పాదంపై బస్సు చక్రం ఎక్కింది. దీంతో ప్రయాణికుని పాదం నుజ్జునుజ్జు అయింది. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో నల్లగొండకు తరలించారు. బాధితుడు నల్లగొండలొని చైతన్యపురి కాలనీకి చెందిన చంద్రకాంత్‌గా గుర్తించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.