'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ అందుకే మారిందా ?
By రాణి Published on 5 Feb 2020 6:42 PM ISTఎన్టీఆర్-రామ్ చరణ్ కలయికలో గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. కాగా ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. వచ్చే ఏడాది జనవరి 8కి పోస్ట్ పోన్ అయింది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను కూడా రిలీజ్ చేస్తూ.. విడుదల తేదీని చాల దూరం జరిపినందుకు కాస్త బాధగా ఉన్నా..సినిమాని అద్భుతంగా తెరకెక్కిసున్నామని ఓ కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వటానికే విడుదల తేదీని మార్చాల్సి వచ్చిందంటూ చిత్రబృందం వివరణ ఇచ్చింది.
అయితే ఇద్దరు హీరోలు గాయాలు పాలుకావడంతో పాటు ఇతర కారణాల వలన అనుకున్న ప్రకారం రాజమౌళి షూటింగ్ జరుపలేకపోయారు. క్వాలిటీ విషయంలో రాజీపడని రాజమౌళి, చివరికీ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు.
కాగా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న అజయ్ దేవగణ్ కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అజయ్ దేవగణ్ సీన్స్ నే షూట్ చేస్తున్నారట. అయితే సినిమాలో అజయ్ దేవగణ్ వల్లే తారక్ - చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని తమ పోరాట విధానాన్ని మార్చుకుంటారని..అజయ్ దేవగణ్ పాత్ర మధ్యలో చనిపోతుందని, అయినా చాల ప్రేరణాత్మకంగా ఉండనుందని తెలుస్తోంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.