సిద్దిపేట జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్య
By సుభాష్ Published on 24 April 2020 9:07 AM IST
సిద్దిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలం రేపింది. చిన్న కోడూరు మండలం రామంచ గ్రామ శివారులో ఎల్లంగౌడ్ అనే రౌడీ షీటర్‌ను దారుణంగా హత్య చేశారు. గతంలో శామీర్‌పేట దగ్గర పోలీసులపై కాల్పులు జరిపి కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసులో ఎల్లంగౌడ్ ప్రధాన నిందితుడని తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలోనూ మృతునిపై కేసులు ఉన్నట్లు సమాచారం. మృతుని స్వగ్రామం సిద్దిపేట మండలం ఇమాంబాద్.
ఎల్లంగౌడ్‌ను పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దండగులు రౌడీషీటర్‌ను నరికిన తల మొండెం వేరు చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎల్లంగౌడ్ హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. అయితే హత్య చేసిన నిందితులు చిన్నకోడూరు పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.