అరె.. 'రొమాంటిక్'గా ముగించబోతున్నారుగా !

By Newsmeter.Network  Published on  16 Jan 2020 4:23 PM GMT
అరె.. రొమాంటిక్గా ముగించబోతున్నారుగా !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా 'రొమాంటిక్'. యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత నెలలో గోవాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుని తిరిగొచ్చాక, హైదరాబాద్ లో సాంగ్స్ తో పాటు కొన్ని కీలకమైన లవ్ సీన్స్ ను తీశారు. ఇక వచ్చే వారంలో చిత్రబృందం తదుపరి షెడ్యూల్‌ ను హైదరాబాద్‌ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్‌ లో క్లైమాక్స్ స‌న్నివేశాలతో పాటు కొన్ని రొమాంటిక్ సీన్స్ కు సంబంధించిన ఫ్యాచ్ వర్క్ షాట్స్ ను కూడా చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్ లో లిప్ టు లిప్ కిస్ సీన్ ఉందట. చివరి షాట్ కిస్ తో షూటింగ్ కి ఫ్యాకప్ చెప్పనున్నారు. మొత్తానికి 'రొమాంటిక్'గా ముగించబోతున్నారు అన్నమాట. అలాగే హీరోహీరోయిన్ల మధ్య నడిచే క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా సెట్ వేసారు. అన్నట్టు ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే రమ్యకృష్ణ ప్లేస్ లో హిందీ బ్యూటీ మందిరా బేడి ఆల్ రెడీ నటించిందట. కానీ ఆ సన్నివేశాలు బాగా రాకపోవడంతో మందిరా బేడి ప్లేస్ లో రమ్యకృష్ణను పెట్టి ఆ సీన్స్ ను మళ్ళీ రీషూట్ చేశారు. పాపం మందిరా బేడికి ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది. ఇక ఈ చిత్రంలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. మరి ఈ చిత్రంతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందా... హిట్ వస్తేనే కెరీర్.. లేకపోతే ఆకాష్ కి కెరీర్ కష్టమే అవుతుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై గాఢమైన స్నేహ పక్షులు పూరి జ‌గ‌న్నాథ్‌ - ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story