రొమాంటిక్ బ్యూటీ డ్యాన్స్ వీడియో వైర‌ల్‌..!

బబ్లి బ్యూటీ కేతికా శర్మ ప్రస్తుతం రొమాంటిక్ చిత్రంలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ త‌న‌యుడు ఆకాష్ హీరోగా పూరీ క‌నెక్ట్స్‌, పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌ల‌పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ కంపెనీలో విజువల్ ఎఫెక్స్ట్ సూపర్ వైజర్‌గా పనిచేసిన అనిల్ పాదూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ పూరీ ఫేవ‌రేట్ ప్లేస్ బ్యాంకాక్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. హీరో హీరోయిన్‌ల మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాల‌తోపాటు కొన్ని పాట‌లను బ్యాంకాక్‌లో తీస్తున్నారు. త‌న కొడుకుని సినీ హీరోగా నిల‌బెట్టే చిత్రంగా రొమాంటిక్‌ను తీర్చిదిద్దేందుకు పూరీ విశ్వ ప్ర‌య‌త్నాలే చేస్తున్నాడు. అందులో భాగంగా టైటిల్‌కు త‌గ్గ‌ట్టు చిత్రంలో రొమాంటిక్ స‌న్నివేశాలు భారీ స్థాయిలోనే ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

ఇక అస‌లు విష‌యానికొస్తే, హీరోయిన్ కేతిక శ‌ర్మ గ‌త కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలే చేస్తోంది. అంద చందాల‌ను ప్ర‌ద‌ర్శించే ఫోటోల‌తోపాటు వీడియోల‌ను సైతం నెట్టింట్లో షేర్ చేస్తూ అభిమానుల సంఖ్య‌ను పెంచుకునే ప‌నిలో బిజీగా గ‌డుపుతోంది. తాజాగా, కేతిక శ‌ర్మ షేర్ చేసిన వీడియో ఒక‌టి ఎప్పటిలాగే సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..!

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.