రెండో ఇన్నింగ్స్ లోనూ రెచ్చిపోయిన హిట్ మ్యాన్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 5:39 PM GMT
రెండో ఇన్నింగ్స్ లోనూ రెచ్చిపోయిన హిట్ మ్యాన్..!

విశాఖపట్నం: ఇండో -సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో భారతీయ బ్యాట్స్‌మెన్‌లు రెచ్చిపోయారు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాదాడు. 149 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ఈ స్కోర్‌లో 7 సిక్స్‌లు, 10 ఫోర్లు ఉన్నాయి. పూజారా తోడుగా రోహిత్ చెలరేగిపోయాడు. పూజారా 148 బంతుల్లో 81 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికాకు భారత్ భారీ లక్ష్యాన్ని ముందు ఉంచింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఎల్గర్‌ను జడేజా 2 పరుగులకే పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో 11/1కే వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. డుప్లిసెస్ సేన విజయానికి ఆఖరి రోజు 384 పరుగులు చేయాలి.

Next Story