ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ ఫోర్‌స్టర్ కన్నుమూత..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 9:31 AM GMT
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ ఫోర్‌స్టర్ కన్నుమూత..!

లాస్ ఏంజెల్స్ : హాలీవుడ్‌లో ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్ని పాత్రలు ఆయన కోసమే పుట్టాయా అన్నట్లు ఒదిగిపోయేవారు. నటనలో తనదైన మార్క్‌ను సృష్టించుకున్న రాబర్ట్ ఫోర్‌ స్టర్‌ ఇక లేరు. బ్రెయిన్ క్యాన్సర్ వ్యాధితో ఆయన మృతి చెందారు. రాబర్ట్ వయసు 78 ఏళ్లు. రాబర్ట్ 100కిపైగా సినిమాల్లో నటించారు. రాబర్ట్ మృతితో హాలీవుడ్ లో భూకంపం వచ్చినట్లైంది. అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ట్విటర్‌లో తమ సంతాపాలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'ఈద్ ఇన్ ఈల్ కమీనో' చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్లాప్‌ అయినప్పటికీ..మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. 'జాకీ బ్రౌన్‌ ' సినిమాలో రాబర్ట్ పోషించిన మాక్స్ చెర్రీ పాత్రకు ఆస్కార్‌ అవార్డ్‌కు ఎంపికయ్యారు. మాక్స్ చెర్రి పాత్ర రాబర్ట్‌కు మంచి పేరు తెచ్చిందనే చెప్పుకోవాలి.

రాబర్ట్ న్యూయార్క్‌లో జన్మించారు. ‘రిప్లెక్షన్స్‌ ఇన్‌ ఎ గోల్డేన్‌ ఐ’ సినిమాతో హీరోగా హాలీవుడ్‌లో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎలిజిబెత్ టేలర్. ప్రముఖ నటుడు మార్టన్‌ ప్రతినాయకుడిగా నటించారు. అలాగే రాబర్ట్‌ పలు టీవీ సీరియల్‌లో టైటిల్‌ రోల్‌లో చేసి తనకుంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ను తెచ్చుకున్నారు.Next Story