తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..ఇద్దరు మృతి

By రాణి  Published on  31 Jan 2020 4:48 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..ఇద్దరు మృతి

మెహదీపట్నం నుంచి శంషాబాద్ వైపుకు వెళ్తున్న కారు (ఏపీ10 బీఈ 5952) అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పై జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల హైవే పై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

మరోవైపు ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్ ఆర్ పురం మండలం నెళవాయి సమీపంలో చెరకు ట్రాక్టర్, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా..వారిని ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందారు. మృతులు దిగువముది కుప్పం హరిజనవాడకు చెందిన రాంబాబు (20), అజిత్ కుమార్ (24)లుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరోవ్యక్తి భాష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Next Story
Share it