చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురి మృతి

By Newsmeter.Network  Published on  5 March 2020 3:18 PM GMT
చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురి మృతి

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెలుతున్న ఏపీ 01 ఏఎఫ్ 7299 కారు ఇందల్వాయి సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతులను నిజామాబాద్‌లోని ఆర్యనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Next Story