ఘోర రోడ్డు ప్రమాదం.. గ్యాంగ్ స్టర్ నయీమ్ మేన కోడలు మృతి

By సుభాష్  Published on  12 Jan 2020 1:18 PM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. గ్యాంగ్ స్టర్ నయీమ్ మేన కోడలు మృతి

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ మృతి చెందారు. షాహేదా నయీమ్ కేసుల్లో నిందితుడు అయిన ఫహీం భార్య. నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ వెనుకాల నుంచి కారు బలంగా ఢీకొనడంతో కారు డ్రైవింగ్‌ చేస్తున్న షాహేదా అక్కడికక్కడే మృతి చెందింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కున్న షాహేదా మృతదేహాన్ని బయటకు తీశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

accident

కాగా, మృతురాలు షాహేదా జంట హత్య కేసుల్లో నిందితురాలు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌ కు చెందిన బెస్త కిష్టయ్య, ఆంజనేయులు జంట హత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటొంది. అంతే కాదు గ్యాంగ్‌ స్టర్‌ నయీమ్‌ చేసిన పలు హత్యల్లోనూ ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు.

Next Story