ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

By సుభాష్  Published on  6 March 2020 9:25 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు - మంగళూరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, మరి కొందరు గాయపడ్దాడారు. అతివేగంగా వెళ్తున్న ఓ కారు ఢివైడర్‌ను ఢీకొట్టి, ఎదురుగా వస్తున్న మరోకారును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కునిగల్‌ తాలుకా అమరితూరు ప్రాంతంలోని బాలాడ్‌కేర్‌ వద్ద ఈ రోజు ఉదయం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులోని హోసూరుకు చెందిన ఓ కుటుంబం 9 నెలల చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు తమబంధువులతో కలిసి తవేరా వాహనంలో ధర్మస్థలి మంజునాథస్వామి ధర్శనానికి వచ్చారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత హోసూరుకు వెళ్తుండగా బెంగళూరు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీవైడర్‌ను ఢీకొట్టి మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

మృతులు తమిళనాడుకు చెందిన 9 నెలల చిన్నారి, మంజునాథ (35), గౌరమ్మ (65), తనుజా (22), రత్నమ్మ (50), రాజేందర్‌ (25), సౌందరాజన్‌ (47), ప్రసూన (15), మాలాశ్రీ (5),30), సరళ (30),లక్ష్మీ కాంత్‌ (25), సందీప్‌ ( 35), మధు (30) గుర్తించారు. కాగా, గాయపడిన వారు హర్షిత (10), గంగోత్రి (15), ప్రకాశ్‌ (25), శ్వేత (30) ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story