బ్రేకింగ్: ప్రాణాలు తీసిన బర్త్ డే సరదా..!...నారాయణ కళాశాల విద్యార్థుల మృతి

By Newsmeter.Network  Published on  29 Nov 2019 2:56 AM GMT
బ్రేకింగ్: ప్రాణాలు తీసిన బర్త్ డే సరదా..!...నారాయణ కళాశాల విద్యార్థుల మృతి

ముఖ్యాంశాలు

  • మృత్యువును వెంటాడిన బర్త్ డే పార్టీ
  • ఇద్దరు విద్యార్థుల మృతి
  • మరొకరి పరిస్థితి విషమం
  • నారాయణ కళాశాలలో విషాదం

విద్యార్థుల బర్తడే పార్టీ ప్రాణాల మీదకు తెచ్చింది. సరదాగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకొందామనుకున్న విద్యార్థులకు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ ప్రైవేటు కళాశాల క్యాంపస్ లో జరిగిన ఈ ఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మాదాపూర్ లోని నారాయణ కళాశాలలో కోచింగ్ తీసుకుంటున్న ఆరుగురు విద్యార్థులు బర్త్ డే పార్టీ ఉందని..ఎవరికి చెప్పకుండా నిన్న అర్థరాత్రి సమయంలో కళాశాల గోడదూకి రాజేంద్రనగర్ కు వెళ్లారు. పుట్టిన రోజు వేడుకలు ముగించుకుని తిరిగి సఫారి కారులో వస్తుండగా, అరంగల్ చౌరస్తా సమీపంలో 221 పిల్లర్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా కారుకు బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థులు నారాయణ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన విద్యార్థులు తరుణ్, ఉదయ్లుగా గుర్తించారు.

Road Accident

Next Story
Share it