ఆర్జేడీ నేత కన్నుమూత

By రాణి  Published on  28 Jan 2020 7:12 AM GMT
ఆర్జేడీ నేత కన్నుమూత

పాట్నా : రాష్ర్టీయ జనతాదళ్ (ఆర్జేడీ) సీనియర్ ఎమ్మెల్యే, బీహార్ మాజీ మంత్రి డాక్టర్ అబ్దుల్ గఫూర్ (61) మృతి చెందారు. సహర్సా జిల్లా మహిషి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన 1995,2000, 2010, 2015 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదే నియోజకవర్గానికి గఫూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఈయన నితీష్ కుమార్ హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. గఫూర్ మృతి పట్ల ఆర్జేడీ నేత తేజస్వి యాదర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం తెలిపారు.

'మాజీ మంత్రి, ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ మృతి చెందిన వార్త నన్ను విచారంలో ముంచెత్తింది. ఆర్‌జేడీ కుటుంబం ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప సహచరుడిని కోల్పోయింది. పార్టీకి ఇది తీరని నష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోస్థైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని తేజస్వి తెలిపారు. సీఎం నితీష్ కుమార్...గఫూర్ గొప్ప రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త అని పేర్కొన్నారు.

Next Story