బాబు చేపట్టిన ప్రతి పనికి రివర్స్ టెండరింగ్: మంత్రి అనిల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 21 Sept 2019 5:33 PM IST

తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతి బట్టబయలైందన్నారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం టెండర్లలో అక్రమాలు ..రివర్స్ టెండరింగ్‌తో బట్టబయలయ్యాయన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వానికి రూ.50 కోట్లు ఆదా చేకూరిందన్నారు. కేవలం రూ.300 కోట్ల టెండర్‌లో రూ.50 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. రివర్స్ టెండరింగ్‌పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. రివర్స్ టెండరింగ్ పారదర్శకంగా నిర్వహించామన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనికి రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామన్నారు. దేశంలోనే విజన్ ఉన్న సీఎం వైఎస్ జగన్ అన్నారు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
Next Story