రివర్స్‌ టెండరింగ్‌..పీపీఏల్లో సీఎం వైఎస్ జగన్ విక్టరీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 11:26 AM GMT
రివర్స్‌ టెండరింగ్‌..పీపీఏల్లో సీఎం వైఎస్ జగన్ విక్టరీ

అమరావతి: రివర్స్‌ టెండరింగ్‌తో ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే ఏపీప్రభుత్వానికి రూ.700 కోట్లకు పైగా ఆదా అయ్యాయి. ఇప్పుడు..పీపీఏ పునః సమీక్షలో కూడా ఏపీ ఖజానాకు మేలు జరిగింది. అటు రివర్స్‌ టెండరింగ్‌లోనూ..ఇటు పీపీఏల్లో చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్‌ విజయం సాధించడానే చెప్పాలి.

విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్ష చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తీర్పు చెప్పింది.రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఒప్పందాలను సమీక్ష చేసే అవకాశం లేదంటూ కోర్టుకెళ్లిన విద్యుత్ సంస్థల వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఏపీ ఈఆర్‌సీ ముందు ఇరు పక్షాలు వాదనలు వినిపించాలని సూచించింది. అలాగే పాత జీవోను పక్కన పెడుతున్నట్టు ప్రకటించింది. విద్యుత్ సంస్థలు కోరినట్టు ఒప్పందంలో ఉన్న అధిక ధరలను చెల్లించకుండా.. సవరించిన ధరలను చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పవన, సౌర విద్యుత్ ఉత్పాదక ధరలు గణీనీయంగా తగ్గాయి. కాని..చంద్రబాబు ప్రభుత్వం రెట్టింపు ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేయడాన్ని సీఎం వైఎస్‌ జగన్ తప్పు పట్టారు. చంద్రబాబు నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాపై రూ.26వేల కోట్ల భారం పడిందని అసెంబ్లీ సాక్షిగా రుజువులు చూపించారు వైఎస్ జగన్.

Next Story