బ్లూ ఫ్లాగ్ బీచ్‌ల జాబితాలో రిషికొండ
By Newsmeter.Network Published on 2 Dec 2019 6:05 PM ISTఢిల్లీ: విశాఖ రిషికొండ బీచ్‌కు ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది. దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేసిన 13 పైలట్ బీచ్‌ల జాబితాలో రిషికొండ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సిప్రియో వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన రాజ్యసభలో తెలిపినట్లు సమాచారం.
అయితే రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. దేశంలోని కొన్ని ఎంపిక చేసిన బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు. అంతర్జాతీయ ఏజెన్సీ అయిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, డెన్మార్క్ సంస్థ అత్యంత కఠినమైన అంశాల ప్రాతిపదికన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను జారీ చేస్తుందని చెప్పారు. బీచ్‌లో స్నానానికి వినియోగించే నీళ్ళ నాణ్యత, బీచ్‌లో పర్యావరణ యాజమాన్యం, రక్షణ కోసం చేపట్టే చర్యల వంటివి ప్రధానమైన అంశాలని చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్ ఇకో టూరిజం మోడల్లో ఉంటుందన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, స్వచ్ఛమైన నీరు, సకల సౌకర్యాలు, ఆరోగ్యవంతమైన పర్యావరణం బీచ్ సందర్శకులకు కల్పించడం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.