70ఏళ్ల వ‌య‌సులో తండ్రైన స్టార్ హీరో.. కంగ్రాట్స్ చెప్పిన మాజీ భార్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2020 3:18 PM GMT
70ఏళ్ల వ‌య‌సులో తండ్రైన స్టార్ హీరో.. కంగ్రాట్స్ చెప్పిన మాజీ భార్య

సినీ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌డు ఏ హీరో అంత త్వ‌ర‌గా పెళ్లిచేసుకోవ‌డం లేదు. మూడు ప‌దులు దాటాల్సిందే. ఇక పిల్ల‌ల్ని క‌నే సరికి నాలుగు ప‌దుల్లోకి అడుగుపెట్టేస్తారు. ప్ర‌స్తుతం ఏ ఇండ‌స్ట్రీలోనైనా ఇదే ట్రెండ్ కొన‌సాగుతుంది. వీరంద‌రికి భిన్నంగా 70 ఏళ్ల వ‌య‌సులో ఓ స్టార్ హీరో తండ్రి అయ్యాడు. అయితే.. ఆ హీరో ఇక్క‌డి వాడు కాదులెండి. హ‌లీవుడ్ కు చెందిన వాడు. ఇక 70ఏళ్ల వ‌య‌సులో తండ్రి కావ‌డంతో ఆ స్టార్ హీరో ఆనందానికి అవ‌ధులు లేవట‌.

హ‌లీవుడ్ న‌టుడు రిచ‌ర్డ్ గేర్ (70), 37 ఏళ్ల అలెజాండ్రా సిల్వ‌ను ఏప్రిల్ 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవ‌ల సిల్వ ఓ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇప్పటికే ఈ జంటకు ఓ కొడుకు ఉన్నాడు. మ‌రోసారి తండ్రైనందుకు ఈ హీరోగారి ఆనందానికి అవుధులు లేవ‌ట‌

ఇదిలా ఉండ‌గా.. మాజీ భార్యతో ఇప్పటికే రిచర్డ్ గేర్‌కు 20 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడి పేరు హామర్. ఇక అతడి మాజీ భార్య కూడా రిచర్డ్ ఇంత లేటు వయసులో తండ్రి అయినందుకు కంగ్రాట్స్ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌న‌వ‌డిని ఎత్తుకోవాల్సిన వ‌య‌సులో కొడుకు ఏంటంట‌ని.. ప‌లువురు కామెంట్లు చేస్తుండ‌గా.. చాలా మంది నెటీజ‌న్లు రిచ‌ర్డ్ గేర్‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

Next Story