ఖాళీగానే ఉన్నారుగా.. ఇప్పుడైనా నా సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి అంటున్నారు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కరోనా మహమ్మారి ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ఎవరికి నచ్చిన పనులతో వాళ్లు కాలక్షేపం చేస్తున్నారు. కొంతమందైతే క్వారంటైనే సమయంలో ఎలాంటి పనులు చేయాలి ? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై వీడియోలు చేసి టిక్ టాక్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు.

Also Read : ప్లీజ్..మాకూ భోజనం పెట్టండి..

అయితే ఎవరెలా ఉన్నా సరే..ఆర్జీవీ మాత్రం తనదైన స్టైల్ లో ఏదొక ట్వీట్ చేస్తూనే ఉంటారు. నిన్న మొన్నటి వరకూ పోలీసులకు సలహాలిస్తూ ట్వీట్లు చేశారు. క్వారంటైన్ సమయంలో నెలకి వెయ్యి గంటలు ఉన్నట్లు అనిపిస్తోంది. సమయం అస్సలు కదలట్లేదు అని ట్వీట్ చేశారు. తాజాగా..నారా చంద్రబాబు, లోకేష్ లకు తన సినిమా చూసి ఎలా ఉందో చెప్పాల్సిందిగా ట్వీట్ చేశారు. వారిద్దరితో పాటు క్వారంటైన్ లో ఉన్నవారందరూ ఇప్పుడైనా అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమా ను అమెజాన్ ప్రైమ్ లో చూడండంటూ లింక్ షేర్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. మరి వర్మ చెప్పినట్లు నారావారి కుటుంబం ఈ సినిమా చూస్తుందో..లేదో..

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.