రివర్స్ టెండరింగ్ సూపర్ హిట్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Oct 2019 5:46 PM ISTఅమరావతి: ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా సత్ఫలితాలనిస్తున్నాయి. నిపుణుల సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి లాభం చేకూరింది. వెలిగొండ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 87 కోట్ల మేర ప్రజా ధన్నాని ఆదా చేసింది.
ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు ప్రాణాధారము. గతంలో రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. ఈ క్రమంలో వెలిగొండ రెండో టన్నెల్ పనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించింది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వెళ్లింది. ఈ ప్రక్రియలో భాగంగా రివర్స్ టెండరింగ్‌లో మేఘా సంస్థ రూ.491.6 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్1గా నిలిచింది. రూ.553.13 కోట్ల టెండర్‌ను 7 శాతం తక్కువకు దక్కించుకుంది. దీనిద్వారా ప్రభుత్వ ఖాజానాకు రూ. 87 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది.