బిగ్‌బ్రేకింగ్ : రేవంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
By Newsmeter.Network Published on 5 March 2020 7:58 PM ISTనిబంధనలకు విరుద్దంగా కేటీఆర్ ఫాంహౌస్‌పై డ్రోన్ కెమెరాలను వినియోగించిన కేసులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అంతకు ముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వస్తుండగా రేవంత్‌రెడ్డిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారని రేవంత్‌పై అభియోగం, ఇప్పటికే నలుగురు రేవంత్‌రెడ్డి అనుచరులను అరెస్ట్ చేశారు. రేవంత్ సహా 8 మందిపై నార్సింగ్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద కేసు నమోదయ్యాయి.
Next Story