'కేసీఆర్‌'కు ఓ కండక్టర్‌ కన్నీటి లేఖ

By Newsmeter.Network
Published on : 27 Nov 2019 2:50 PM IST

కేసీఆర్‌కు ఓ కండక్టర్‌ కన్నీటి లేఖ

తెలంగాణలోఆర్టీసీ కార్మికుల సమ్మెనేపథ్యంలో కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే...తాజాగా ఓ కండక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను డిమాండ్ల సాధన కోసం తాము సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్నతీరుపై తాను రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ ఓ కన్నీటి లేఖను రాశారు.

సూర్యాపేట డిపోకు చెందిన లూనావత్‌ కృష్ణ అనే కండక్టర్‌ కేసీఆర్‌కు రాజీనామా లేఖను రాస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లేఖలో లూనావత్‌ కృష్ణ పలు విషయాలను ప్రస్తవించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా.... ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా ... కానీ కేసీఆర్‌ లాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా.. నాయనా అనే విధంగా గా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నానని పేర్కొన్నారు. కేసీఆర్‌ మాటలు తప్పడం, మాయ మాటలు చెప్పి మోసం చేయడం తెలుసని, కేసీఆర్‌ ఉద్యోగాల్లోంచి తీసివేసే ముందే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

సమ్మె కారణంగా సుమారు 30 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనీసం కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కారణంగా ఉద్యోగం నిలిచిపోయి ఇంట్లో వాళ్లందరూ ఏడుస్తుంటే తట్టుకోలేకపోయానని, తమ కుటుంబ సభ్యుల ఉసురు కేసీఆర్‌ తప్పకుండా తగులుతుందని లేఖలో పేర్కొన్నారు. సూర్యాపేట డిపో కు చెందిన తాను రాజీనామా చేస్తున్నానని, ఆర్టీసీ సంస్థ నుంచి రావల్సిన జీతాన్ని ఇప్పించి, తాను పంపిస్తున్న రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇవన్నీ భరించలేకనే నా ఆత్మభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేక రాజీనామా సమర్పిస్తున్నానని అన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులకు మీరు ఏమి ఇవ్వకున్నా కనీసం పిలిపించి మాట్లాడి ఉంటే మీపై ఉన్న గౌరవంతో తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఉండేవారమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగిగా ఉన్నందుకు తక్షణమే నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛను ఇవ్వండని వేడుకున్నాడు. అలాగే తన పేరుపై సెంటు భూమి కూడా లేదని, తనకు మూడెకరాల పొలం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరారు.

Next Story