జియో బంపర్‌ ఆఫర్‌: రూ. 4కే 1జీబీ డేటా..!

By సుభాష్  Published on  16 May 2020 6:35 AM GMT
జియో బంపర్‌ ఆఫర్‌: రూ. 4కే 1జీబీ డేటా..!

టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియో తన కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ప్రమ్‌ హోం చేస్తున్నారు. ఇప్పటి వర్క్‌ ఫ్రం హోమ్‌ పేరుతో జియో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇంటర్నెట్‌ను అధికంగా ఉపయోగించే కస్టమర్లకు మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది జియో. ఈ ప్యాకేజీ ధర రూ. 999 ధర నిర్ణయించింది. 84 రోజుల పాటు వ్యాలిడిటీ. ఈ ప్లాన్‌ తీసుకుంటే రోజుకు 3 జీబీ చొప్పున డేటా అందించనుంది. డేటాతో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో నుంచి జియో నంబర్లకు, జియో నుంచి ల్యాండ్‌లైన్‌ నంబర్లకు పూర్తిగా ఉచితమని తెలిపింది.

అయితే శుక్రవారం ప్రకటించిన ఈ రూ.999 ఆఫర్‌తో రోజుకు 3 జీబీలు ఇస్తూ, 84 రోజుల వరకూ మొత్తం 252 జీబీ డేటా అందించనుంది. మొత్తం మీద ఈ లెక్కన చూస్తే 1జీబీ డేటా దాదాపు రూ.4 పడుతుంది. అంటే కేవలం రూ. 3.96 మాత్రమే పడుతుంది.

Next Story