పెళ్లి బరాత్‌లో డిష్యూం డిష్యూం..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 11:17 AM GMT
పెళ్లి బరాత్‌లో డిష్యూం డిష్యూం..

సూర్యాపేట : కోదాడలో ఓ పెళ్లి బరాత్ విషయంలో చెలరేగిన ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఈ సంఘటన కోడాడ మండలంలోనే తోగరాయ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే పెళ్లైన తర్వాత ఊరేగింపుకు రెండు కుటుంబాల బంధువులు సిద్ధమయ్యారు. అనంతరం అబ్బాయి తరుపు బంధువులు డీజేతో బరాత్ నిర్వహించాలనకున్నారు. కానీ.. అమ్మాయి తరఫు బంధువులు మాత్రం బరాత్‌కు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి..రెండు కుటుంబాల బంధువులు తీవ్రంగా దాడి చేసుకునేవరకు వెళ్లింది.

అయితే అమ్మాయిది ప్రకాశం జిల్లా కావడంతో ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని..అమ్మాయి తరుపు బంధువులు చెప్పారు. దీనిలో భాగంగానే డీజే వద్దంటూ అమ్మాయిని, అబ్బాయిని తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ.. అబ్బాయి తరఫు బంధువులు దాన్ని అడ్డుకొని వారిపై దాడికి దిగారు. దీంతో రెండు కుటుంబాల తరపువారు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఇరువర్గాలకు చెందిన యువకులు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో పెళ్లి ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Next Story
Share it