ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించిన 16 ఏళ్ల పర్యావరణ ప్రేమికురాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 6:21 AM GMT
ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించిన 16 ఏళ్ల పర్యావరణ ప్రేమికురాలు..!

స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్‌బర్గ్‌ ..పర్యావరణ మార్పులపై అశ్రద్ధ వహించడానికి 'మీకెంత ధైర్యం' అంటూ.. ఐక్యరాజ్య సమితి వేధికగా ప్రపంచ నేతల్నీ గతంలో కడిగిపారేససిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి గ్రెటా థెన్‌బర్గ్‌ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 84 దేశాలు సభ్యులుగా ఉన్న 'నోర్డియాక్‌ కౌన్సిల్‌' ప్రకటించిన 'ఎన్విరాన్‌మెంట్‌ అవార్డ్‌' ను థెన్‌బర్గ్‌ నిరాకరించింది. నాయకులు దృష్టి సారించాల్సింది..అవార్డులపై కాదని..!పర్యావరణ కార్యాచరణపై అంటూ..నాకులకు మరోసారి చురకలంటించే ప్రయత్నం చేసింది. అయితే ఈ అవార్డుకు దాదాపు రూ.36 లక్షల నగదు బహుమతి అందజేస్తుండటం గమనార్హం. ఈ విషయాన్ని థేన్‌బర్గ్‌ ట్విటర్ వేదికగా ప్రకటించింది. పర్యావరణంపై చేస్తున్న పోరాటానికి అవార్డులు అవసరం లేదని..అందుబాటులో ఉన్న పర్యావరణాన్నికాపాడే మార్గాలపై... రాజకీయ పార్టీలు, ప్రజలు దృష్టి పెట్టడమే కావాలని' థెన్‌బర్గ్‌ వ్యాఖ్యానించింది. అనంతరం తన పోరాటాన్ని గుర్తించినందుకు నోర్డియాక్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.

Next Story