భారీగా తగ్గిన బంగారం ధర

By సుభాష్  Published on  13 Jan 2020 12:54 PM GMT
భారీగా తగ్గిన బంగారం ధర

పసిడి కాస్త దిగొస్తుంది. ఉరుకులు పరుగులు పెడుతున్న బంగారం ధర.. జనాల్లో కాస్త ఉపశమనం కలిగించింది. 8వ తేదీన హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.42,860 ఉండగా, వరుసగా బంగారం ధర పరుగులు పెడుతూ వచ్చింది. ఇలా బంగారం ధరలు పెరుగుతూ రికార్డు సృష్టించింది. కానీ జనవరి 13న పది గ్రాముల పసిడి ధర రూ. 41,460 ధరకు పడిపోయింది. అంటే కేవలం ఆరు రోజుల్లోనే ఏకంగా రూ. 1400 ధర తగ్గిపోయింది. కొంత కాలంగా బంగారం పైపైకి వెళ్తూ జనాలను కలవరపెడుతోంది. సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో భారీ గా బంగారం పెరగడంతో జనాలు ఆందోళన చెందారు. సోమవారం నాటి పసిడి ధరలను పరిశీలిస్తే హైదరాబాద్‌ లో రూ. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.600 తగ్గింది. రూ. 42,060 నుంచి 41,460కి దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గింది. ప్రస్తుతం రూ. 38,010 ధర ఉండగా, న్యూఢిల్లీలో 236 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.40,432 ఉండగా, అంతర్జాతీయ మార్కెటలో ఔన్స్‌ బంగాంర ధర 1,550 డాలర్లు ఉంది.

ఇక బంగారం మాత్రమే కాదు. వెండి ధరలు కూడా దిగి వస్తున్నాయి. ఇటీవల బంగారం ధర పెరిగినట్లే వెండి ధర కూడా పరుగులు పెట్టింది. ఇప్పుడు బంగారం ధర దిగి వస్తుండటంతో వెండి ధరలు దిగొస్తున్నాయి. జనవరి 8న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 51 వేలు ఉండగా, జనవరి 13వ తేదీన రూ. 49 వేలకు దిగి వచ్చింది. అంటే ఆరు రోజుల్లో రూ. రెండు వేల రూపాయలు తగ్గింది. న్యూ ఢిల్లీలో వెండి ధర రూ.376 తగ్గి రూ. 47,635 ధరకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ వెండి ధర 17.97 డాలర్లు. అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్ధవాతావరణం కాస్త ప్రశాంతత నెలకొనడం, రూపాయి బలపడటం లాంటి కారణాలతో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. ఇక సోమవారంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడింది. ముందుగా బంగారం వెండి ధరలు అకాశన్నంటడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఇప్పుడు మళ్లీ కాస్త ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది.

కాగా, పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తగ్గినా.. వచ్చే కాలంలో వీటి ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోలిక ఉద్రిక్తతలు ఇందుకు దోహద పడతాయంటున్నారు నిపుణులు. ఇక రానున్న రోజుల్లో బంగారం ధర రూ. 50వేలకు చేరినా పెద్దగా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయంటున్నారు.ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పంగారం ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోలిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు తదితర అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

Next Story