ముంబై: గుడ్‌న్యూస్‌: తగ్గిన బంగారం ధరలు

By సుభాష్  Published on  15 Jun 2020 1:05 PM GMT
ముంబై: గుడ్‌న్యూస్‌: తగ్గిన బంగారం ధరలు

సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు దిగివచ్చాయి. ముంబై ఎంసీఎక్స్‌ లో 10 గ్రాముల బంగారం ధరపై రూ. 576 తగ్గి, ప్రస్తుతం రూ.46,758 ఉంది. ఇక కిలో వెండి రూ.733 క్షిణించి ప్రస్తుతం రూ.46,957 ఉంది.

ఇక చైనాలోలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీ స్థాయిలో పతనానికి అడ్డుకట్టవేసిందని, అమెరికా సహా ఇతర దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో బంగారం ధరలపై ప్రభావం చూపాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు తగ్గుముఖం తాత్కాలికం మాత్రమేనని, చైనా-అమెరిక ఉద్రిక్తతలు నేపథ్యంలో బంగారం ధరలు నిలకడగా ముందుకు సాగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story