సాగర్‌ ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 5:48 AM GMT
సాగర్‌ ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం

నల్గొండ: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి తగ్గింది. శనివారం అధికారులు ఎనిమిది క్రస్ట్‌గేట్లను ఎత్తారు. 20 అడుగుల ఎత్తులో నీటిని కాల్వల ద్వారా కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 3,47,402 ల క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతుండడంతో 2,66,417 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.654 టీఎంసీలుగా ఉంది.

Next Story